- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బనకచర్లను అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యాం.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సక్సెస్ అయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సక్సెస్ అయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నిర్మించిన తలపెట్టిన గోదావరి-బనచకర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమనే విషయాన్ని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ (Central Committee of Environmental Experts) తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో తాము బనకచర్లపై అభ్యంతరాలను కేంద్రం దృష్టి బలంగా తీసుకెళ్లామని తెలిపారు. దీంతో బనకచర్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందని అన్నారు. అదేవిధంగా గోదావరిలో వరద జలాలను సమగ్రంగా లెక్కించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని తెలిపారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ గోదావరి ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు తమకు అందాయని కేంద్రం స్పష్టం చేసిందని వివరించారు. కేంద్ర జల సంఘం ఆమోదం, తదితర అంశాలను అధిగమించాకే ప్రతిపాదనలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర నుంచి ఆదేశాలు అందాయని అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.






