- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పోస్టులకు మాకు సంబంధం లేదు.. హైడ్రా సంచలన ట్వీట్
హైడ్రా పేరిట సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు తమకు సంబంధం లేదని, తాము రాజకీయాలకు అతీతం అని హైడ్రా (Hydra) ట్వీట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా పేరిట సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు తమకు సంబంధం లేదని, తాము రాజకీయాలకు అతీతం అని హైడ్రా (Hydra) ట్వీట్ చేసింది. అంతేగాక హైడ్రాను రాజకీయాలకు ఆపాదిస్తూ పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల కాలంలో హైడ్రా వారియర్స్ (Hydra Warriors) సహా పలు పేర్లతో సోషల్ మీడియాలో హైడ్రాకు సంబంధించిన పోస్టులు పెడుతున్నారు. దీనిపై హైడ్రా అధికారులు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా.. హైడ్రా రాజకీయాలకు (Politics) అతీతంగా పని చేస్తుందని, హైడ్రా వారియర్స్ పేరిట పెట్టిన పోస్టులకు హైడ్రాకు సంబంధం లేదని తెలిపింది. అలాగే హైడ్రాను ముడిపెడుతూ ఎవరైనా రాజకీయాలను జోడించి పోస్టులు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ (Warning) ఇచ్చింది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రభుత్వ, ప్రజోపయోగ భూముల కాపాడడం, ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలకు అండగా ఉండడం హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. ఇక హైడ్రా ఎప్పుడూ రాజకీయాలకు దూరంగానే వుంటుందని, రాజకీయపరమైన పోస్టులు హైడ్రా పెట్టదని రాసుకొచ్చింది.






