- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
మొక్కజొన్న కొనడానికి కేంద్రం సుముఖంగా లేదని, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు నేటి నుండి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభిస్తున్నట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మొక్కజొన్న కొనడానికి కేంద్రం సుముఖంగా లేదని, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు నేటి నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వాటితో పాటు సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని, వెంటనే కలెక్టర్లు జిన్నింగ్ సెంటర్లు నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం వివిధ పంటల కోతలు ప్రారంభమైన సందర్భంగా వాటి సేకరణ, మార్కెటింగ్ శాఖ ద్వారా వరి ధాన్య సేకరణలో అవసరమయ్యే క్లీనర్లు, టార్పలిన్లు లభ్యతపై సమీక్షించారు.
అదేవిధంగా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక హెచ్‌వోడీని అన్ని పంటల కొనుగోళ్లకు సమన్వయ అధికారిగా నియమించామని, వీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లతో సమన్వయం చేసుకొని రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ఎండీ వేర్ హౌజ్, వరంగల్ జిల్లాకు డైరెక్టర్ హార్టీకల్చర్, నల్లగొండ జిల్లాకు డైరెక్టర్ అగ్రికల్చర్, మహబూబ్ నగర్ జిల్లాకు ఎండీ హాకా, ఖమ్మం జిల్లాకు డైరెక్టర్ మార్కెటింగ్, ఆదిలాబాద్ జిల్లాకు డైరెక్టర్ సీడ్ సర్టిఫికేషన్, కరీంనగర్ జిల్లాకు ఎండీ ఆగ్రోస్, మెదక్ జిల్లాకు ఎండీ మార్క్‌ఫెడ్, రంగారెడ్డి జిల్లాకు ఎండీ ఆయిల్‌ఫెడ్ స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లుగా మంత్రి తుమ్మల వెల్లడించారు.






