సిట్ విచారణపై మాకు నమ్మకం లేదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-08 06:14:51  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు. ఈ

సిట్ విచారణపై మాకు నమ్మకం లేదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఇవాళ పాదయాత్రగా సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు. ఈ మేరకు ముందుగా ఆయన ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల క్రితమే విచారణ రావాలని సిట్ కోరిందని తెలిపారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా సిట్ అధికారులకు అందజేస్తున్నానని అన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌నే ఎక్కువగా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినా, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంతో పాటు సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను కాపాడుకుంటూ వస్తోందని అన్నారు. ఇందంతా టైం పాస్ వ్యవహారంలా కనిపిస్తోందని ఆరోపించారు. కేసులో కీలక ఆధారాలు ఉన్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య దోస్తీ ఉంది కాబట్టే కేసీఆర్ (KCR) కుటుంబంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వెంటనే సీబీఐ (CBI)కి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Next Story