- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mallu Ravi : వరంగల్ నేతల వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం : మల్లు రవి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్(Warangal), గజ్వేల్(Gajwel) నియోజకవర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్న మల్లు రవి.. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)తో చర్చించి సమస్యలను తెలుసుకొని, పార్టీ లైన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళితో ఇతర కాంగ్రెస్ నేతల మధ్య ఇటీవల వర్గపోరు తీవ్రమైన సంగతి తెలిసిందే. వరంగల్ నేతల వ్యవహారం.. అలాగే గజ్వేల్‌లో స్థానిక నాయకత్వంపై ఫిర్యాదులు క్రమశిక్షణా కమిటీకి చేరాయి.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలు, అంతర్గత వివాదాలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరంగల్, గజ్వేల్‌లోని అంతర్గత సమస్యలు కాంగ్రెస్ బలోపేతానికి సవాలుగా మారగా.. మల్లు రవి కమిటీ నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.






