- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సార్వత్రిక సమ్మెకు మేం దూరం: భారతీయ మజ్దూర్ సంఘ్
by Ajay Maddhiboyina |
నేడు కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో తాము పాల్గొనడం లేదని భారతీయ మజ్దూర్‌సంఘ్ (బీఎంఎస్) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో తాము పాల్గొనడం లేదని భారతీయ మజ్దూర్‌సంఘ్ (బీఎంఎస్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమ్మెకు తాము దూరంగా ఉంటున్నామని, తమ అనుబంధ సంఘాలేవీ ఈ సమ్మెలో పాల్గొనడంలేదని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలాల్ శ్రీనివాస్, టీ రాంరెడ్డిలు పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కోడ్ ఆన్ వేజెస్ -19, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీస్‌లను తాము స్వాగతించామని, కావున నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ తలపెట్టిన సమ్మెలో తాము భాగస్వామ్యం కావడంలేదన్నారు. బీఎంఎస్ అనుబంధ కార్మిక సంఘాలేవీ సమ్మెలో పాల్గొనవద్దని వారు పిలుపునిచ్చారు.
Next Story






