- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని.. తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి భరోసానిచ్చారు

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని.. తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి భరోసానిచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. అదేవిధంగా యూనియన్ రూపొందించిన 2026 మీడియా డైరీని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపచేయించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు నూతన సంవత్సర కానుకగా సంక్షేమ పథకాలు అందించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ సీఎం కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఇక సీఎంను కలిసిన వారిలో ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె.శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కిరణ్ కుమార్, అజిత, చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ మోహియుద్దీన్, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరీష్ ఉన్నారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యూనియన్ ప్రతినిధి బృందం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.
సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.






