- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ashok Reddy: నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ నీటి వినియోగంపై ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ నీటి వినియోగంపై ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున, నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్ మెంట్‌పై జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్‌తో కలిసి రీజినల్ ఈడీలు, డైరెక్టర్లలు, సీజీఎంలు, జీఎంలతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ సమీక్ష నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్‌గా ట్యాంకర్ బుకింగ్ ఘననీయంగా పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్‌లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు.
గత ఏడాది కంటే మణికొండ, బంజారాహిల్స్, డొయెన్స్, హఫీజ్ పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్లో నీటి సరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్ స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్ ని డెలివరీ చేసేలాగా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో మొత్తం 2,24,421 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామని, ఈ నెలలో 12వ తేదీ నాటికే 95,454 ట్రిప్పులు సరఫరా చేసినట్టు తెలిపారు.
నీటి పొదుపుపై ఎండీ విజ్ఞప్తి..
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజులలో నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి పౌరుడు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ జూమ్ మీటింగ్‌లో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, డైరెక్టర్లు ఆపరేషన్స్-1,2,3 వినోద్ భార్గవ, నారాయణ, శీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






