- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలమండలి మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌కు రిమాండ్
by Malleboina Mahesh |
జలమండలి జీఎం అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ జరిపిన సోదాల్లో ₹1.10 కోట్ల నగదు, 2 కేజీల బంగారం దొరికాయి. ఆస్తుల విలువ ₹100 కోట్లుగా అంచనా.

X
దిశ, వెబ్ డెస్క్: అవినీతి తిమింగలం, జలమండలి మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ (Anantha Lakshmi Kumar)కు కోర్టు రిమాండ్ విధించింది. మంగళవారం తన ఇల్లు సహా ఇతర 9 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఏసీబీ (ACB) సోదాల్లో భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు బుధవారం ఉదయం జడ్జి ముందు హాజరు పరిచారు. దీంతో అతనికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు అనంత లక్ష్మీకుమార్ ను తరలించారు.
కేసు వివరాలు..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB - జలమండలి) రెడ్ హిల్స్ డివిజన్ (ప్రాజెక్ట్ డివిజన్-VIII) జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) సగ్గం అనంత లక్ష్మి కుమార్ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే (Disproportionate Assets) పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. మల్లాపూర్‌లోని ఆయన ప్రధాన నివాసంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 9 ప్రాంతాల్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి.
సోదాల సమయంలో కుమార్ నివాసంలో లభ్యమైన ₹1.10 కోట్ల నగదును చూసి అధికారులు విస్తుపోయారు. వీటితో పాటు 2.1 కేజీల బంగారు ఆభరణాలు, 9.2 కేజీల వెండి వస్తువులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అలాగే 18 ఎకరాల భూమి, 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తింపు.. మార్కెట్ లో వీటి విలువ ₹100 కోట్ల వరకు ఉంటుంది. ఈ భారీ మొత్తంలో అక్రమాస్తులు భయటపడటంతో ప్రస్తుతం జలమండలి మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయారు.
Next Story






