సీఎల్పీ లీడర్‌గా ఉన్నందుకు CM పదవి ఆశించా.. డిప్యూటీ సీఎం భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-11 05:30:14  IST  )

సీఎల్పీ లీడర్‌గా ఉన్నందుకు తాను సీఎం పదవిని ఆశించానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మనసులో మాటను బయటపెట్టారు.

సీఎల్పీ లీడర్‌గా ఉన్నందుకు CM పదవి ఆశించా.. డిప్యూటీ సీఎం భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎల్పీ లీడర్‌గా ఉన్నందుకు తాను సీఎం పదవిని ఆశించానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మనసులో మాటను బయటపెట్టారు. ఓ మీడియా హౌస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించింది నిజమేనని అన్నారు. కానీ, అధిష్టానం ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవితో తాను సంతోషంగానే ఉన్నానని అన్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటి‌రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)కి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి తమకు దరిదాపుల్లో కూడా బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు లేవని కామెంట్ చేశారు. ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో అధికార నేతల మధ్య సఖ్యత లేదని ప్రశ్నించగా.. తనకు పొంగులేటి, తుమ్మల, రేణుకా చౌదరిలతో ఎలాంటి విబేధాలు లేవని అన్నారు.

అదేవిధంగా గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఎలా కట్టాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిస్తే.. ఆ ప్రాజెక్టును ఎలా ఆపాలో తమకు తెలుసని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నివేదికపై అడ్డగోలుగా వ్యవహరించబోమని అన్నారు. ఎవరినో జైలుకు పంపించాలని తాము అనుకోవట్లేదని తెలిపారు. నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. కమిషన్ రిపోర్టును తాము మార్చామన్నది పూర్తిగా అవాస్తవమని కొట్టిపడేశారు. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపడమైనా.. ఇంకేదైనా అసెంబ్లీనే నిర్ణయిస్తుందని, కమిషన్ ఇచ్చిన నివేదిక కాపీలను బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు అందజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Next Story