- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక వసూళ్లు నిజమే కానీ.. నాకు, నా కొడుకుకు సంబంధం లేదు: ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా, వసూళ్ల వ్యవహారంపై ఎమ్మెల్యే నాగరాజు ఘాటుగా స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా, వసూళ్ల (Illegal sand transportation and collection) వ్యవహారంపై ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) ఘాటుగా స్పందించారు. తన మండల నాయకుడు అక్బర్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామని ఆయన మీడియాకు వెల్లడించారు. తన కుమారుడి పేరు చెప్పి కొందరు అక్రమ వసూళ్లు చేస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో తన కుమారుడి అనుచరుడైన భాను అనే కార్యకర్త ఇలాంటి పనులకు పాల్పడితే మందలించానని గుర్తు చేస్తూ.. మరోసారి ఎవరైనా పార్టీ పేరుతో వసూళ్లకు పాల్పడితే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను తాను ఖచ్చితంగా అడ్డుకుంటానని, అయితే రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఈ దందాను పట్టించుకోవట్లేదని ఆయన ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. సొంత పార్టీలోని ఒక వర్గమే తన ఎదుగుదలను, నియోజకవర్గ అభివృద్ధిని ఓర్చుకోలేక తనపై, తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేస్తోందని నాగరాజు ఆరోపించారు. తనను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలు నమ్మవద్దని, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు డిమాండ్ చేశారు.






