- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత కలలు కనాలి.. మేము మీ వెంటే ఉంటాం : రాష్ట్ర యువజన కార్యదర్శి కుంజా సూర్య
యువత కలలు కనాలని, ఆ కలలను నిజం చేసేందుకు మేము అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి కుంజా సూర్య పిలుపునిచ్చారు.

దిశ, కొత్తగూడ : యువత కలలు కనాలని, ఆ కలలను నిజం చేసేందుకు మేము అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి కుంజా సూర్య పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగూడ మండలంలోని పోలారం గ్రామంలో ప్రగతి యువజన సంఘం-పోలారం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్-ఖమ్మం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో కొత్తగూడ జట్టు ఘన విజయం సాధించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కుంజా సూర్య మాట్లాడుతూ గెలుపు - ఓటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు గెలుపు కోసం మైదానంలో అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. నేటి ఓటమిని రేపటి విజయానికి మెట్టుగా భావించాలని, క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని మంత్రి సీతక్క నాయకత్వంలో యువత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, క్రీడలు, విద్య, ఉపాధి రంగాల్లో యువతకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్, కొత్తగూడ, గంగారం మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు,కొత్తగూడ, వేలుబెల్లి, బత్తులపల్లి, రామన్న గూడెం, సాదిరెడ్డి పల్లి సర్పంచ్ లు మల్లెల భాగ్యమ్మ, వజ్జ అక్షయ్ వర్మ, ఈసం పుష్ప, తేజవత్ పార్వతి, ఆలూరి కిరణ్, జేఎల్ఎన్ వైసీ కొత్తగూడ అధ్యక్షులు మల్లెల రణధీర్ పాల్గొన్నారు.






