పట్టాలు దాటుతుండగా రైలు ప్రమాదం..యువకుడి మృతి

by Bhanu |

వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

పట్టాలు దాటుతుండగా రైలు ప్రమాదం..యువకుడి మృతి
X

దిశ, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే... రెడ్లవాడ గ్రామానికి చెందిన కర్నెకంటి కర్ణాకర్ (19) హైదరాబాద్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తాత మృతిచెందిన నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన కర్ణాకర్, సోమవారం రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై స్పందించిన ఆర్పీఎస్ హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్, పోస్టుమార్టం అనంతరం మృతుడి మృతదేహాన్ని అతడి తండ్రి ఐలయ్యకు అప్పగించినట్లు తెలిపారు.


Next Story