Ghanpur Station: రైలు కింద పడి యువకుడు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-05-13 16:20:01  IST  )

చాగల్లు సమీపంలో యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు..

Ghanpur Station: రైలు కింద పడి యువకుడు దుర్మరణం
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: చాగల్లు సమీపంలో యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని గ్యాంగ్ మెన్ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాజీపేటకు చెందిన జీఆర్పీ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తెలుపు రంగులో ఉన్న మృతుడి వయసు 30 ఏళ్ల లోపు ఉంటుందని భావిస్తున్నారు. మృతుడు గులాబీ రంగు చొక్కా, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నారు. పూర్తి వివరాలకు కాజీపేట రైల్వే పోలీసులను సంప్రదించాలని కాజీపేట జీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.

Next Story