- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడు సెల్ఫ్ కిడ్నాప్!
సినీ ఫక్కీలో ఓ యువకుడు తనకు తానే కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. స్నేహితుడితో తన తండ్రికి ఫోన్ చేయించి డబ్బు డిమాండ్ చేయించాడు.

యువకుడు సెల్ఫ్ కిడ్నాప్!
- తండ్రికి ఫోన్ చేయించి రూ.10లక్షలకు స్కెచ్
- చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలు
దిశ, వరంగల్ టౌన్ : సినీ ఫక్కీలో ఓ యువకుడు తనకు తానే కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. స్నేహితుడితో తన తండ్రికి ఫోన్ చేయించి డబ్బు డిమాండ్ చేయించాడు. తీరా పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో హైరానా రేకెత్తించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నగరం వాసవీ కాలనీకి చెందిన అదిత్ సోనీ(31) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడ్డాడు. డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో కిడ్నాప్ స్కెచ్‌కు రూపకల్పన చేసుకున్నాడు. పోచమ్మమైదాన్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న తన స్నేహితుడు మహ్మద్ యాకూబ్ పాషా(35)తో కలిసి తనకు తానే కిడ్నాప్ ప్లాన్ వేసుకున్నాడు. ఇద్దరు నగరంలోని ఒక లాడ్జ్ లో గది తీసుకున్నారు. యాకూబ్‌పాషాతో కుటుంబసభ్యులకు సోమవారం ఫోన్ చేయించాడు. అదిత్‌ను కిడ్నాప్ చేశామని, పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. అదిత్ తండ్రి వెంటనే ఈ విషయాన్ని మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మట్టెవాడ సీఐ ఎన్.కరుణాకర్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో అదిత్, అతని స్నేహితుడిని హంటర్‌రోడ్డులోని బొందివాగు వద్ద మంగళవారం పట్టుకున్నారు. వారిని విచారించగా.. కిడ్నాప్ డ్రామా బట్టబయలైంది. కాగా, వారిద్దరి నుంచి టీఎస్ 24 టీ 3210 నంబర్ ఆటోను, రెండు సెల్‌ఫోన్లు, నలుపు రంగు స్కార్ప్స్, నైలాన్ తాడు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా, కుమారుడి కిడ్నాప్ బూటకమని తెలియడంతో అదిత్ కుటుంబ సభ్యులు ఊపిరి తీసుకున్నారు.






