బైక్ పై నుంచి జారిపడి మహిళ మృతి..

by Bhanu |

చిట్యాల మండల కేంద్రానికి చెందిన చింతకింది రాజమణి (57) ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

బైక్ పై నుంచి జారిపడి మహిళ మృతి..
X

దిశ, చిట్యాల : చిట్యాల మండల కేంద్రానికి చెందిన చింతకింది రాజమణి (57) ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రాజమణి ఈ నెల 27న వ్యక్తిగత పనుల నిమిత్తం రేగొండ మండలం కాకర్లపల్లెకు బైక్‌పై వెళ్తుండగా మార్గ మధ్యలో చిట్యాల సమీపంలోని తిరుమలపూర్ వద్ద ఓ పంది అకస్మాత్తుగా బైక్‌కు అడ్డుగా రావడంతో ఆమె కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆమెను వెంటనే చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండకు, అక్కడి నుంచి హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో రాజమణి మృతిచెందారు. మృతురాలికి భర్త రవీందర్, కుమారుడు రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.


Next Story