రైతులపై అడవి పంది దాడి..!

by S Gopi |

రైతులపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం... Wild boar attack on farmers

రైతులపై అడవి పంది దాడి..!
X

దిశ, కొత్తగూడ: రైతులపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి గ్రామంలోని వీరంపేటలో చోటుచేసుకుంది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం .. గ్రామానికి చెందిన పెనుక సురేందర్, మంకిడి లక్ష్మిపతి ఉదయం తమ మొక్కజొన్న చేనులో కంకులు విరుస్తుండగా వారి పైన అడవి పంది దాడి చేసింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామస్తులు తరలించారు.

Next Story