- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవిపంది దాడిలో తునికాకు కూలీకి గాయాలు
గంగారం మండలం ఈశ్వరగూడెం శివారులోని అడవిలో తునికాకు సేకరణకు వెళ్లిన కుంజ రామయ్య అనే కూలిపై అడవి పంది దాడిలో తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకొంది.

దిశ, కొత్తగూడ : గంగారం మండలం ఈశ్వరగూడెం శివారులోని అడవిలో తునికాకు సేకరణకు వెళ్లిన కుంజ రామయ్య అనే కూలిపై అడవి పంది దాడిలో తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకొంది. బంధువులు, కూలీలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రోజూలాగే తునికాకు సేకరణ అడవిలోకి వెల్లిన రాములు ఆకు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అక్కడే తారస పడిన అడవి పంది ఒక్కసారిగా రాములుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తీవ్రంగా రక్తస్రావంతో అతని పరిస్థితి విషమించడంతో సేకరణకు తోటి కూలీలు సమాచారం ఇచ్చారు.
దీంతో సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన వెంటనే స్థలానికి చేరుకొని 108 ఈ ఎం టి కవిత అత్యంత చురుకుగా స్పందించి రక్తస్రావాన్ని నియంత్రిస్తూ ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో పైలట్ సంపత్ వేగంగా దగ్గరలోని కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రికి రాములను తరలించి చికిత్స అందించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందివల్ల రాములు ప్రాణాపాయం నుండి బయటపడగలిగారు. ఈ కృషిని గుర్తించి బాధితుడి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది ,గ్రామస్థులు 108 సిబ్బందిని అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో పనిచేస్తున్న 108 సిబ్బంది సేవలు ప్రశంసనీయమైనవని అభినందించారు.






