- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారం లోపు ధాన్యాన్ని తరలిస్తాం.. రైతులు అధైర్య పడొద్దు
ఆత్మకూర్ మండల నీరుకుళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం సందర్శించారు.

దిశ, ఆత్మకూర్ : ఆత్మకూర్ మండల నీరుకుళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను పోలీస్ కమిషనర్ దృష్టికి సొసైటీ సిబ్బంది తీసుకురాగా.. అనంతరం సొసైటీ సిబ్బందిని రఘును అడిగి అసలు ఏం జరుగుతుంది..? ఎందుకు మొక్కజొన్నలు తరలిస్తు లేరు..? ఎవరు నిర్లక్ష్యం అని అడిగారు. సిబ్బంది రఘు మాట్లాడుతూ కేవలం ట్రాన్స్ పోర్ట్ వల్లే జరుగుతుందని ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కలెక్టర్ తో మీటింగ్ ఉందని.. వారం లోపు అన్ని మక్కాలను వెంటనే పంపిస్తా రైతులు అధైర్య పడొద్దు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని వరంగల్ సీపీ తెలిపారు. రైతులను దృష్టికి తీసుకపోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ రైతులకు భరోసానిచ్చారు. పోలీస్ కమిషనర్ వెంట ఆత్మకూర్ ఇన్స్ స్పెక్టర్ సంతోష్, ధాన్యం కొనుగోలు కేంద్రం అధికారులు ఉన్నారు






