వీధిలోనే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రమా..? చెత్తపై శానిటేషన్‌ విఫలం.!

by Bhanu |

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అనేది ప్రత్యేక యంత్రాల, సాంకేతిక విధానాలపై ఆధారపడి జరగాల్సిన ప్రక్రియ.

వీధిలోనే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రమా..? చెత్తపై శానిటేషన్‌ విఫలం.!
X

దిశ, వరంగల్‌ టౌన్‌: చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అనేది ప్రత్యేక యంత్రాల, సాంకేతిక విధానాలపై ఆధారపడి జరగాల్సిన ప్రక్రియ. కానీ వరంగల్ నగరంలో మాత్రం ఇవేవీ లేకుండానే రోడ్డు పక్కనే విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని కనిపిస్తున్న తీరు గమనార్హంగా మారింది.

ఎస్‌బీహెచ్‌ ప్రధాన కార్యాలయం పక్కన ఉన్న పెట్రోల్‌బంక్‌ ఎదురుగా చెత్త పేరుకుపోయిన వీధిలో, ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండడం చూసినవారికి.. "ఇదేనా చెత్త ఆధారిత విద్యుత్ కేంద్రం?" అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చెత్తను సరిగా తరలించకపోవడం, ప్రజా ప్రదేశాల్లోనే వదిలేయడం వల్ల శుభ్రతపై బల్దియా శానిటేషన్‌ విభాగం దారుణంగా విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

“స్వచ్ఛ భారత్‌ అంటూ ఊదరగొట్టే అధికారులు వీధుల్లో నెలకొన్న చెత్తను అసలు గమనించలేదా?” లేక నిజంగానే అక్కడ చెత్త ఆధారిత విద్యుత్ తయారీ జరుగుతోందా? అని ప్రజలు సహజంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణ స్థితిని చూసిన వరంగల్‌ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ అధికారులు, శానిటేషన్ సిబ్బందే.


Next Story