వరంగల్ అడిషనల్ డీసీపీ రవికి ఇండియన్ పోలీస్ మెడల్

by Chintha Aamani |

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పరిపాలన విభాగం అదనపు డీసీపీ గా విధులు నిర్వహిస్తున్న నల్లమల రవికి ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్ అడిషనల్ డీసీపీ రవికి ఇండియన్ పోలీస్ మెడల్
X

దిశ,వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పరిపాలన విభాగం అదనపు డీసీపీ గా విధులు నిర్వహిస్తున్న నల్లమల రవికి ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండ ప్రాంతానికి చెందిన అడిషనల్ డీసీపీ నల్లమల రవి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యం.ఎస్సీ పూర్తి చేసి 1991 సంవత్సరంలో ఎస్. ఐ గా ఎంపికై శిక్షణ అనంతరం మెదక్ జిల్లాలోని శివం పేట, తుఫ్రాన్, మునిపల్లె పోలీస్ స్టేషన్లలో ఎస్. ఐ గా చేసి సీఐ గా పదోన్నతి పొంది అమ్రాబాద్, మిర్యాలగూడ, సదాశివపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ సీఐ పనిచేశారు.

అలాగే డి.ఎస్పీగా సంగారెడ్డి, జహీరాబాద్, అడిషనల్ డీసీపీ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ గా పని చేశారు. ముఖ్యంగా అదనపు డీసీపీ నక్సల్ ప్రాబల్యం ఉన్న పోలీస్ స్టేషన్లలో సమర్థవంతంగా పని చేయడంతో పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా విజయవంతం విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొందడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నుండి పలు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ మెడల్ ఎంపికైన అడిషనల్ డీసీపీ రవికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తో పాటు డీసీపీ లు, అడిషనల్ డీసీపీ, ఏ. ఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది అభినందనలు తెలిపారు.

Next Story