రేపు వ‌రంగ‌ల్‌కు వాల్తేరు వీర‌య్య యూనిట్‌.. గ్రాండ్‌గా సక్సెస్ ఈవెంట్

by Dishanational4 |
రేపు వ‌రంగ‌ల్‌కు వాల్తేరు వీర‌య్య యూనిట్‌.. గ్రాండ్‌గా సక్సెస్ ఈవెంట్
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో: హ‌న్మకొండ‌లో మెగాస్టార్ చిరంజీవి శ‌నివారం ప‌ర్యటించ‌నున్నారు. మెగాస్టార్ న‌టించిన వాల్తేర్ వీర‌య్య సంక్రాంతికి విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఈ చిత్ర విజ‌యానందాన్ని వ‌రంగ‌ల్ అభిమానుల మ‌ధ్య జ‌రుపుకోవాల‌ని భావించింది. ఈ మేర‌కు హ‌న్మకొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో శ‌నివారం సాయంత్రం విజ‌యోత్సవ స‌భ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తి కావ‌చ్చాయి. గ‌త రెండు రోజులుగా మెగా ఫ్యామిలీ అభిమానులు కొంత‌మంది చిత్ర యూనిట్ రాక సంద‌ర్భంగా సంద‌డి మొద‌లుపెట్టారు. ఇక శ‌నివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా జ‌ర‌గ‌బోయే కార్యక్రమంలో చిరంజీవి, ర‌వితేజ‌, హీరోయిన్ శృతిహాస‌న్‌తో పాటు యూనిట్ స‌భ్యులు పాల్గొన‌నున్నారు.



Next Story

Most Viewed