వరంగల్ పోర్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీలు

by Nallavelli.Anjaneyulu |

ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. గురువారం వారు కార్యాల‌యం గేట్లను మూసివేసి తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ గా జరిగే లావాదేవీలు పరిశీలించారు.

వరంగల్ పోర్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో  విజిలెన్స్ అండ్  ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీలు
X

దిశ, వరంగల్ బ్యూరో : ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. గురువారం వారు కార్యాల‌యం గేట్లను మూసివేసి తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ గా జరిగే లావాదేవీలు పరిశీలించారు. స్టాంప్ డ్యూటీ చెల్లింపు, గడిచిన కొన్ని నెలలుగా జరిగిన డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. ఇన్ చార్జి సబ్ రిజిస్ట్రార్ వెంకట్ లాల్ ను విచారించారు. డాక్యుమెంట్, స్టాంప్ డ్యూటీ ల అవకతవకల పై అధికారులను అడుగుతూ వివరాలు నమోదు చేసుకున్నారు. డీఎస్పి మల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. విజిలెన్స్ అండ్ ఎంపోర్స్మెంట్ అధికారుల తనిఖీల నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్స్ ముందస్తుగా సెటర్స్ మూసి వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నట్ల తెలిపారు.

Next Story