విప్ కు వేం నరేందర్ రెడ్డి అభినందనలు

by Ratna Kumari |

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీలు అధికార పార్టీ కైవసం చేసుకోవడంపై అధిష్టానం హర్షం వ్యక్తం చేస్తుంది.

విప్ కు వేం నరేందర్ రెడ్డి అభినందనలు
X

దిశ, డోర్నకల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీలు అధికార పార్టీ కైవసం చేసుకోవడంపై అధిష్టానం హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ ను శభాష్ నాయక్ అంటూ సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభినందించారు. ఆదివారం డోర్నకల్ మరిపెడ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి విప్ వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్‌ లోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి రామచంద్రనాయక్ ను ప్రజాదరణ పొందిన నాయకుడిగా మరో మారు అభినందిస్తూ ప్రశంసించారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఘనవిజయం ప్రజల నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సమర్థ నాయకత్వం, నిరంతర ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఓటర్లందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Next Story