- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి ప్రధాత 'వేం' కు ఆదరణ కరువు!
మున్సిపల్ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో మహా నాయకుడు వేం నరేందర్ రెడ్డి నరాజ్ అయినట్టు సమాచారం.

దిశ, కేసముద్రం : సొంత మండలం పై ఉన్న ప్రేమ...తన వారిని అభివృద్ధి వైపు నడపాలన్న ఆకాంక్ష.. కలసి కేసముద్రం కు వందల కోట్ల నిధులు, పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల ల అనుమతి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన స్థానిక మహానాయకుడు వేం నరేందర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో నారాజ్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీలకు అతీతంగా ప్రజల హృదయాలను గెలుచుకున్న 'వేం' కు మాత్రం మున్సిపల్ ఎన్నిక చేదు అనుభవాలు మిగిల్చింది. రాష్ట్రంలో అధికారం ఉండి.. ఎమ్మెల్యే, ఎంపీలు ఉండి ఎంతో అభివృద్ధి చేస్తున్న వేం గారి సొంత ప్రాంతంలో 16 కౌన్సిలర్లు ఉన్న కేసముద్రం మున్సిపాలిటీ లో కాంగ్రెస్ కు 8 మాత్రమే రావటం ఎంతో నిరాశాజనకం.
అసలు ఈ ఓటమికి కారణం ఎవరు..?
ఆశించిన ఫలితాలు రాకపోవటం వెనుక అసలు కారణాలు ఏమిటి అని ప్రజల్లో చర్చ మొదలైనది. స్థానిక నాయకత్వ పోరు...రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు... బి ఆర్ ఎస్ పార్టీ లో ఉన్న కరుడు కట్టిన కార్యకర్తల పనితీరు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు వెలుగుచూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్లు గా నిలుచున్న నాయకులు తమ పార్టీలోని వేరే నాయకుడు గెలిస్తే పార్టీలో తమ ప్రాతినిధ్యం తగ్గుద్దని పార్టీలో తన సన్నిహితుల ద్వారా సొంత పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఓటమికి కృషి చేసినట్టు కొందరు నాయకులపై అభియోగం కూడా ప్రచారంలో ఉంది, ఇంకా... రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తామని ప్రకటించిన ఆరు గ్యారంటీ లు అమలుకాకపోవటం, ప్రభుత్వ వైఫల్యాలు కూడా కేసముద్రం లో నిరాశజనకమైన ఫలితాలకు ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సొంత పార్టీ లో వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ఎవరని ప్రజలు గుసగుసలాడుచున్నారు. వేం అభివృద్ధి పై ప్రజలలో అభిమానం ఉన్నపటికీ.. సొంత పార్టీ స్థానిక నాయకత్వ పోరు వల్లే ఆశించిన ఫలితాలు రాలేదు అని ప్రజలు విశ్వసిస్తున్నారు.
నత్తనడకన సాగుతున్న అభివృద్ధి పనులు
రోడ్డు వెడల్పు లో భాగంగా మెట్లు అరుగులు కూల్చటం వల్ల ఇంటిలోకి వెళ్ళలేక పోతున్న భాదితులు. కొన్ని వందల కోట్ల తో చేపడుతున్న కేసముద్రం అభివృద్ధి పనులు వేగం లో నత్తలతో పోటీ పడుతున్నాయి. అధికారుల నిర్లక్షం వల్ల గత కొన్ని నెలలుగా ఉప్పరపల్లి రోడ్ లో మరియు మార్కెట్ బజార్ లో రోడ్ వెడల్పు పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాళ్ళు తేలి ఉండటం వలన వాహనాలకు పంక్చర్ లు అవుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కంకర తేలివుండటంతో ద్విచక్ర వాహన దారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. రోడ్ పై నీళ్లు కొట్టకపోవడం వలన దుమ్ము లేచి ఇండ్లలో ఉన్న వంటపాత్రలపై పడి ఆహారం కాలుస్యమవుతుంది. ముఖ్యంగా ఉప్పరపల్లి రోడ్ లో ప్రజలు తమ ఇంటి ముందు మెట్లు కూల్చటం వల్ల ఇంట్లోనుండి బయటకు లోపలకు వెళ్ళటం చాలా కష్టంగా వున్నదని త్వరితగతిన పనులు పూర్తయితే మెట్లు కట్టుకొని మరమత్తులు చేయించుకుంటామని ప్రజలు కోరుతున్నారు. "వేం" వారు చేసే అభివృద్ధి..., అధికారుల నిర్లక్షం వలన నెమ్మదించటం తో ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు తొందరగా జరిపించి ప్రజల ఇబ్బందులు తీర్చాలని స్థానికులు కోరుకుంటున్నారు.






