- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా యాప్.. అష్టకష్టాలు పడుతున్న రైతులు
యూరియా యాప్ లో యూరియా బుక్ చెసుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని అధికారుల ఆఫీస్ దగ్గరికి వెళ్లితే అధికారులు ఉండడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

దిశ, ధర్మసాగర్ : యూరియా యాప్ లో యూరియా బుక్ చెసుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని అధికారుల ఆఫీస్ దగ్గరికి వెళ్లితే అధికారులు ఉండడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ రైతులకు ఇబ్బందులు సృష్టిస్తోంది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్,వేలేరు మండలల్లో యూరియా ఉన్నప్పటికీ, యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో బస్తాల యూరియా ఉన్నట్లు యాప్‌లో చూపిస్తున్నా, రైతులు బుకింగ్ చేసుకోలేకపోతున్నారు. యాప్ కోసం రైతులు పనులు మానేసి చూసుకోవాల్సి వస్తుందని, యూరియా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యాప్‌ను నిలిపివేసి, పాత పద్ధతిలోనే యూరియా అందించాలని ఆప్ లో బుక్ చేసుకోరాక యూరియా కోసం 4రోజులుగా తిరుగుతున్న రైతు చిట్యాల వీరయ్య రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల దగ్గరికి వెళ్లినా వాళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యూరియా యాప్ తో రైతుల అవస్థలు
యూరియా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ రైతులకు ఉపయోగపడాల్సిన స్థితి పోయి, ఇప్పుడు తలనొప్పిగా మారుతోంది. యాప్ వాడకం పై కనీస అవగాహన కల్పించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు యాప్ ఎలా ఉపయోగించాలి, నమోదు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. రైతులకు సాయం చేయాల్సిన రైతు వేదికలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు గంటల తరబడి యూరియా సెంటర్ల వద్ద ఎదురు చూసినా ఆప్ సంబందిత సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రైతులు ముందుగానే యాప్‌లో బుక్ చేసుకున్నా, సర్వర్ మొరాయించడంతో యూరియా తీసుకునే అవకాశం లేకపోతోంది. నెట్‌వర్క్ సమస్యలు, సర్వర్ డౌన్ కావడం, టెక్నికల్ లోపాలు తరచూ ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. యాప్ ద్వారా పారదర్శకత తీసుకురావాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా, అమలు లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ ఉద్దేశం నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, రైతు వేదికలను చురుగ్గా పనిచేసేలా చేయాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే సాగు కాలంలో యూరియా కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






