గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం..

by Bhanu |   (  Updated:2025-06-15 16:50:28  IST  )

జనగామ జిల్లా సమీప ప్రాంతం యశ్వంతపూర్ వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం అయినట్లు తెలిపారు జనగామ పోలీసులు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం..
X

దిశ, జనగామ: జనగామ జిల్లా సమీప ప్రాంతమైన యశ్వంతపూర్ వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. జనగామ పోలీసుల కథనం మేరకు.. యశ్వంతపూర్ వాగు సమీపంలో అటువైపుగా గొర్రెలు కాస్తున్నటువంటి గొర్ల కాపరికి ఒక పురుషుడి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించగా, వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయడంతో వెంటనే జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డి సిబ్బంది‌తో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యక్తి సుమారు 50 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉంటుందని ఒంటిపై ఎలాంటి దుస్తలు లేవని తెలిపారు. అలాగే కుడి చేతికి తాడు కట్టుకొని ఉన్నదని, పచ్చ రంగు మొలతాడు కలదనీ ఎర్రటి రంగు డ్రాయర్, బ్రాండ్ నల్లటి రంగు 9 సైజ్ చెప్పులు కలిగి ఉన్నవి అని తెలిపారు. పై ఆధారాలతో గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి ఎలాంటి వివరాలు లభించిన వెంటనే జనగామ పోలీసులకు సమాచారం అందజేయగలరు అని తెలిపారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు జనగామ ఎస్‌హెచ్‌వో ..8712685202, ఎస్ఐ 8712685260 పోలీస్ స్టేషన్ 8712685032.

Next Story