పాకాల వాగులో గుర్తు తెలియని మృతదేహం కలకలం

by Bhanu |

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొల్లాపురం గ్రామ శివారులో ఉన్న గంగాదేవిపల్లి తండా వద్ద గురువారం ఉదయం పాకాల వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

పాకాల వాగులో గుర్తు తెలియని మృతదేహం కలకలం
X

దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొల్లాపురం గ్రామ శివారులో ఉన్న గంగాదేవిపల్లి తండా వద్ద గురువారం ఉదయం పాకాల వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయం పక్కనే పొలాలలో పనులకు వెళ్లిన గ్రామస్థులు వాగులో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వెంటనే సమాచారం ఇచ్చిన గూడూరు ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి పోలీసు బృందంతో ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు గోధుమ కలర్ చొక్కా నల్ల రంగు పాయింటు ధరించి ఉన్నారని మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉందని మృతదేహం పట్ల అనుమానంగా ఉంటే సంబంధికులు ఎవరైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.


Next Story