- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి ఫోన్.. చివరి శ్వాస.. అప్పులు తీర్చలేక మనోవేదనతో మృతి
మైక్రో ఫైనాన్స్ రుణాలు తీర్చలేక మనోవేదనతో భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఓ యువకుడు మృతి చెందిన విషాదం శుక్రవారం జరిగింది.

దిశ భీమదేవరపల్లి : మైక్రో ఫైనాన్స్ డబ్బులు తీర్చలేక మనోవేదనతో యువకుడు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో శుక్రవారం నాడు చోటుచేసుకుంది. భార్య రుచిత తెలిపిన వివరాల ప్రకారం ముల్కనూర్ గ్రామానికి చెందిన మాడుగుల కిరణ్(35) సుతారి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిల రిత్యా అతని ఇటీవలే ఐదు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సంబంధించిన వాటి ద్వారా మూడు లక్షల వరకు రుణం తీసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కూలి పని చేసుకుంటూ అప్పులు సకాలంలో తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో బిల్డింగు నిర్మాణం పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కిరణ్ చేయికి గాయం కావడంతో పది కుట్లు పడ్డాయి.
అనారోగ్యం రీత్యా పనికి వెళ్లకపోవడం మైక్రోఫైనాన్స్ సంస్థలకు అప్పులు కట్టలేక ఎప్పుడు దిగులుగా ఉండేవాడని ఆమె తెలిపింది. భర్త బాధను చూడలేక కుటుంబ సమస్యలను తీర్చడం కోసం బుధవారం నాడు రుచిత తన పుట్టింటి వెళ్ళింది. గురువారం నాడు పనికి వెళ్లిన కిరణ్ తన భార్య రుచిత కు ఫోన్ చేసి టెన్షన్ అవుతుందని చెప్పాడు. శుక్రవారం ఉదయం ఆమె ఫోన్ చేసినప్పటికీ రెస్పాన్స్ కాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించగా కిరణ్ మంచంపై విగత జీవి లాగా కనిపించాడు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన దంపతుల్లో కుటుంబ యజమానిని కోల్పోవడంతో చిన్నారులైన ప్రజ్ఞ నైనికల ను చూసి కాలనీవాసులు కంటతడి పెట్టారు. కిరణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు.






