ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

by Ratna Kumari |

ఆలయంలో చోరీ చేసిన ఇద్ద‌రు అంత‌ర్రాష్ట్ర దొంగ‌ల‌ను అరెస్ట్ చేసిన ఘ‌ట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
X
దిశ, ఆత్మకూర్ : ఆలయంలో చోరీ చేసిన ఇద్ద‌రు అంత‌ర్రాష్ట్ర దొంగ‌ల‌ను అరెస్ట్ చేసిన ఘ‌ట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ స‌తీష్ బాబు వెల్ల‌డించిన‌ వివ‌రాల ప్ర‌కారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ భీమ‌వ‌రం ప్రాంతానికి చెందిన క‌ల్ల‌కూరి కిర‌ణ్ బాబు, అనంత‌పురం జిల్లాకు చెందిన సందీప్ కుమార్ ఇరువురు ఈనెల 18న అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఆత్మ‌కూరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో గూడెప్పాడు గ్రామంలోని ఆల‌యంలో ఆల‌యానికి సంబంధించిన వెండి సామాగ్రిని చోరీ చేశారు. ఈ చోరీపై ఆలయ నిర్వహకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆత్మకూరు పోలీసులు వెంటనే స్పందించి పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ వినియోగించి నిందితులను గుర్తించారు. రోజు ఉదయం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు ఆత్మకూరు పోలీసులకు చెప్పారు. చోరీలకు పాల్పడిన నిందితుల్లో ఒకడైన కిరణ్ బాబు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి మొత్తం 50 కి పైగా చోరీలకు పాల్పడినట్లుగా పోలీస్ విచారణలో వెల్ల‌డైంది. ఈ సందర్భంగా నిందితులను 24 గంటల్లో పట్టుకొని చోరీ సామగ్రిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఆత్మకూర్ ఇన్ స్పెక్ట‌ర్ సంతోష్ తో పాటు అతని సిబ్బందిని ఏసీబీ అభినందించారు.
Next Story