- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా తరలిస్తున్న రెండు దూడలు స్వాధీనం.. ఐదుగురిపై కేసు నమోదు
by Ratna Kumari |
బచ్చన్నపేట మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ వద్ద వధ నిమిత్తం అక్రమంగా తరలిస్తున్న రెండు మగ దూడలను పోలీసులు పట్టుకున్నారు.

X
దిశ, బచ్చన్నపేట : బచ్చన్నపేట మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ వద్ద వధ నిమిత్తం అక్రమంగా తరలిస్తున్న రెండు మగ దూడలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బచ్చన్నపేట పశువుల సంతకు వచ్చారు. వారు ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకుండా రెండు మగ దూడలను వధించడానికి అక్రమంగా తరలిస్తుండగా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని మద్దూర్ మండలానికి చెందిన ఆరిఫ్, కనకయ్య, వాహన డ్రైవర్ వెంకటేష్‌లుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అబ్దుల్ వజీద్, షన్నులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై శ్రీకాంత్ ప్రజలను తెలియజేశారు.
Next Story






