యూరియా కలిపిన నీళ్లు తాగి రెండు గేదెలు మృతి

by velandi.Saikiran |   (  Updated:2026-03-19 20:31:02  IST  )

గంగ బజారు కాలనీలో యూరియా నీళ్లు తాగి ములుకూరు వెంకటరెడ్డికి చెందిన రెండు పాడి గేదెలు గురువారం మృతి చెందాయి.

యూరియా కలిపిన నీళ్లు తాగి రెండు గేదెలు మృతి
X

దిశ, బయ్యారం: మండల కేంద్రంలోని గంగ బజారు కాలనీలో యూరియా నీళ్లు తాగి ములుకూరు వెంకటరెడ్డికి చెందిన రెండు పాడి గేదెలు గురువారం మృతి చెందాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం... ములుకూరు వెంకటరెడ్డి కుటుంబ స‌భ్యులు పొరపాటున సగ్గుబియ్యంకు బదులు యూరియాను నీటిలో నానబెట్టి మూడు పాడి గేదెలకు ఇచ్చారు. దీంతో రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. దీంతో వారికి సుమారుగా లక్షా 60 వేల ఆస్తి నష్టం జ‌రిగింది. మరో గేదె చావు బతుకుల మధ్యలో ఉన్నట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. విషయం తెలిసి పశు వైద్య అధికారులు వెటర్నరీ అసిస్టెంట్ పూసం శ్రావణి, గోపాల మిత్ర వైద్య సిబ్బంది పాడి గేదెకు వైద్యం అందిస్తున్నారు.

Next Story