- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్జనలో పోటీ తత్వం పెంపొందించుకోవాలి
విద్యార్జనలో పోటీ తత్వం కలిగి ఉండాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మండల కోఆర్డినేటర్ చరణ్ సింగ్

దిశ, ఖానాపురం: విద్యార్జనలో పోటీ తత్వం కలిగి ఉండాలని, విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేలా కృషి చేస్తున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మండల కోఆర్డినేటర్ చరణ్ సింగ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో టి సాట్- జి హెచ్ ఎం ఏ ఆధ్వర్యంలో సంయుక్తంగా వార్షిక పోటీ పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 6-10 తరగతుల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు 55 మంది కి పైగా తమ గైడ్ టీచర్ , ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. పోటీలలో మూడు విభాగాలలో ప్రథమ స్థానంలో నిలిచిన ముగ్గురు విద్యార్థులను ఈ నెల 10 వ తేదీన నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సోమలక్ష్మి, ఉపాధ్యాయులు రామ్ మోహన రావు, రవీందర్, మోతీలాల్, శశికుమార్, వీరన్న, శ్రీనివాస్, రవికుమార్ లతో పాటు ఎం ఆర్ సి సిబ్బంది మహేందర్ , రమేష్ , శశిధర్ పాల్గొన్నారు.






