TS UTF డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన చీప్ విప్

by Javid Pasha |
TS UTF డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన చీప్ విప్
X

దిశ, హన్మకొండ: TS UTF డైరీ, క్యాలెండర్ ను ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బుధవారం హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధితో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని, ప్రవేట్ పాఠశాలలకు ధీటుగా ఉపాధ్యాయులు బోధన చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్, టీఎస్ యూటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సదాశివారెడ్డి, పెండెం రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్.రవీందర్ రాజు, జిల్లా కార్యదర్శులు సీఎస్ఆర్ మల్లిక్, ఎం.శశిధర్ రెడ్డి, కె.మోజేష్, ఎండీ స్టాలిన్ బేగ్, ఎ.రాజా రామ్, కె.సదానందం, మెరుగు ప్రసన్న, హనుమకొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సీహెచ్ లింగారావు, హనుమకొండ జిల్లా అకాడమిక్ సెల్ కన్వీనర్ తిరునగర్ శ్రీనివాస్, మండల బాధ్యులు సురేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed