- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక లోడ్లతో వెళ్తున్న టిప్పర్లు
మండలంలో పరిమితిని మించి టిప్పర్లు సంచరిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలోని ప్రగతి సింగారం గ్రామ పరిసరాల్లో భారీ లోడ్లతో వెళ్తున్న వాహనాల రాకపోకలు పెరిగినట్లు తెలుస్తోంది

X
దిశ, శాయంపేట : మండలంలో పరిమితిని మించి టిప్పర్లు సంచరిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలోని ప్రగతి సింగారం గ్రామ పరిసరాల్లో భారీ లోడ్లతో వెళ్తున్న వాహనాల రాకపోకలు పెరిగినట్లు తెలుస్తోంది. అధిక బరువుతో తిరిగే తిప్పర్ల వల్ల గ్రామీణ రహదారులు బీటలు వారుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు కుంగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు, విద్యార్థులు, రైతులు రహదారులపై నడవడానికే భయపడే పరిస్థితి నెలకొంది. నియమ, నిబంధనలు అమలులో ఉన్నాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాలు సంభవించే ముందే చర్యలు తీసుకుని పరిమితికి మించిన లోడ్లపై కట్టడి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రహదారుల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story






