గంజాయి సేవిస్తూ ప‌ట్టుబ‌డ్డ ముగ్గురు యువకులు

by Ratna Kumari |

మండల కేంద్రం లో గంజాయి తాగుతూ ముగ్గురు యువకులు పట్టుబడినట్టు స్థానిక ఎస్సై చింత రాజు తెలిపారు.

గంజాయి సేవిస్తూ ప‌ట్టుబ‌డ్డ ముగ్గురు యువకులు
X

దిశ, కొడకండ్ల : మండల కేంద్రం లో గంజాయి తాగుతూ ముగ్గురు యువకులు పట్టుబడినట్టు స్థానిక ఎస్సై చింత రాజు తెలిపారు. శుక్రవారం ఎస్సై కథనం ప్రకారం.. పాలకుర్తి ఇన్ స్పెక్ట‌ర్ జానకిరామ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై రాజు, కానిస్టేబుల్ రాకేష్, శ్రీకాంత్, వెంకటేష్ పెట్రోలింగ్ వేస్తున్న సమయంలో కొడకండ్ల గ్రామంలో ఆదర్శ పాఠశాల ఆవరణ వెనుక ప్రాంతంలో ముగ్గురు యువకులు గంజాయి తాగుతూ ఉన్నారని నమ్మదగిన సమాచారం తో పోలీసులు పెట్రోలింగ్ చేప‌ట్టారు. అయితే బూర్క నవీన్, చెన్న సాయి, దేశబోయిన సతీష్ లు గంజాయి సేవిస్తూ ఉండ‌టంతో వారిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story