ఆర్టీసీని అద్దంలాగా మెరిపిస్తా అని అంధకారం లోకి నెట్టారు

by Ratna Kumari |

ఆర్టీసీని అద్దంలాగా మెరిపిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అంధకారంలోకి నెట్టారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు.

ఆర్టీసీని అద్దంలాగా మెరిపిస్తా అని అంధకారం లోకి నెట్టారు
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ఆర్టీసీని అద్దంలాగా మెరిపిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అంధకారంలోకి నెట్టారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా హనుమకొండలోని వివిధ డిపోల వద్ద కార్మికులకు రాకేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమ‌య్యేంత వ‌ర‌కు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారని.. వాటిని నేడు నెరవేర్చకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు పథకం పెట్టి ఆర్టీసీని ఏ విధంగా ఉద్ధరించారో తెలపాలన్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పించి ఆర్టీసీ యూనియన్ లా పునరుద్ద‌ర‌ణ‌కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story