బైక్ అదుపుతప్పి కిందపడి యువకుడికి తీవ్ర గాయాలు

by Sridhar Babu |   (  Updated:2023-02-15 15:26:11  IST  )

అతివేగం కారణంగా ద్విచక్ర వాహన దారుడికి తీవ్ర గాయాలైన ఘటన వరంగల్ - నర్సంపేట ప్రధాన రహదారిలో దుగ్గొండి మండలం గిర్నీబావి దగ్గర బుధవారం చోటుచేసుకుంది.

బైక్ అదుపుతప్పి కిందపడి యువకుడికి తీవ్ర గాయాలు
X

దిశ, దుగ్గొండి : అతివేగం కారణంగా ద్విచక్ర వాహన దారుడికి తీవ్ర గాయాలైన ఘటన వరంగల్ - నర్సంపేట ప్రధాన రహదారిలో దుగ్గొండి మండలం గిర్నీబావి దగ్గర బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన మేకల రంజిత్ (30) తన బంధువుల ఇంటికి వంచనగిరికి వెళ్లి తిరుగుపయణమయ్యాడు. గిర్నీబావి స్టేజీ వద్ద అతివేగం తో రావడంతో శ్రీరామ వైన్స్ వద్ద ఉన్న గుంతల్లో అదుపు తప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న దుగ్గొండి ఎస్సై నవీన్ కుమార్ గాయాలపాలైన వ్యక్తిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Next Story