- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు ఇబ్బందులు కలుగకుండా కాంటాలు త్వరగా పూర్తి చేయాలి
కాంటాలు త్వరగా పూర్తి చేసి, ధాన్యం బస్తాలను లారీల ద్వారా సకాలంలో మిల్లులకు తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కేంద్ర నిర్వాహకులను అదేశించారు.

దిశ, రఘునాథపల్లి: కాంటాలు త్వరగా పూర్తి చేసి, ధాన్యం బస్తాలను లారీల ద్వారా సకాలంలో మిల్లులకు తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కేంద్ర నిర్వాహకులను అదేశించారు. మంగళవారం మండల కేంద్ర పరిధిలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, కంచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల పీఏసీఎస్ ధ్యానం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం బస్తాల కాంటా ఎంత వేస్తున్నారు కేంద్రాలకు లారీలు సకాలంలో వస్తున్నాయా, తాడిపత్రిలు సరిపడా నిల్వలు ఉన్నాయా..? లేదా అని కేంద్ర నిర్వాహకులను అడిగితెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అవాంతరాలు లేకుండా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలని, రవాణా ఏర్పాట్లు సక్రమంగా చేయాలని సూచించారు.
రైతులు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని వెంటనే తూకం వేసి, ఆలస్యం లేకుండా, రైతులు వేచి చూసే పరిస్థితి రాకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. తేమ శాతం నిర్ధారణ ప్రకారం.. ధాన్యం స్వీకరించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రాల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, రికార్డులు సరైన విధంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలపై ఆరా తీశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు. కేంద్రంలో చికిత్స కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారి ఆరోగ్య సమస్యలను, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సమయానికి హాజరు కావడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని సూచించారు.ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సంబంధిత అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.






