సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

by Elthuri vijay kumar |

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని, ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పిలవడే పత్రికలు, పాఠకులకు వాస్తవాలు అందించాలని, ప్రజలు విశ్వసించే వార్తలు వ్రాయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు.

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
X

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

స్వాతంత్ర సమరంలో పత్రికలది ప్రధాన పాత్ర

పాఠకులు విశ్వసించే విధంగా కథనాలు ఉండాలి

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

భూపాలపల్లిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ మూడో మహాసభలు

దిశ, భూపాలపల్లి : సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని, ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పిలవడే పత్రికలు, పాఠకులకు వాస్తవాలు అందించాలని, ప్రజలు విశ్వసించే వార్తలు వ్రాయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం ఆయన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మూడవ మహా సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర సమరంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. పత్రికలో వచ్చే వార్తలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరారు. నేడు సోషల్ మీడియాలో పనిచేసేవారు సైతం జర్నలిస్టుగా చెప్పుకోవడం సరికాదన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుగా పనిచేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు .

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పనిచేసే అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ నిబంధన మేరకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు హెల్త్ కార్డులు ఇప్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి సాయం చేసే విధంగా ప్రయత్నిస్తానన్నారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చర్చించి తొందరగా జర్నలిస్టులకు సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, యూనియన్ నాయకులు బసవ పున్నయ్య, రాజేందర్, రఘు, సతీష్ కుమార్ పాల్గొన్నారు.

Next Story