- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యధేచ్చగా మట్టి తరలింపు.. పట్టించుకొని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు...
నడికూడ మండలం చర్లపల్లి గ్రామం,లో ఈదులకుంటలో నల్ల మట్టి,మొరం అక్రమ తరలింపు జోరుగా సాగుతుంది.

దిశ, నడికూడ : నడికూడ మండలం చర్లపల్లి గ్రామం,లో ఈదులకుంటలో నల్ల మట్టి,మొరం అక్రమ తరలింపు జోరుగా సాగుతుంది. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో జెసిబి పెట్టి గత కొద్ది రోజులుగా ట్రాక్టర్లను అద్దెకు తీసుకొని ప్రభుత్వ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నల్లమట్టిని మొరంను అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక చెరువుల నుండి నల్లమట్టిని మొరం,ను తీయాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్డు అదుపు లేకుండా అక్రమార్కులు మట్టిని తరలిస్తున్నారు. మట్టిని తరలించకుండా అడ్డుకట్ట వేయడంలో రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులు విఫలమయ్యారని. ఈ రెండు శాఖ అధికారులు కనీసం చెరువులపై కన్నెత్తి చూడడం లేదని విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. చెరువులు నుండి మొరం, మట్టి, తరలిస్తున్న కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులు మీనవేషాలు వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జెసిబి లతో మట్టిని తరలిస్తే సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేస్తారు అనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోందని, గ్రామాల్లోని పౌరులు ఎవరైనా సమాచారం ఇస్తే వారి పేరును బయటపెట్టే అధికారులు ఉండడంతో గ్రామాల్లోని పౌరులు మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని జెసిబి ట్రాక్టర్ యజమాలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
ఇరిగేషన్ డి ఈ శ్రీనివాస్ ను ఈ విషయం పై రెండు సార్లు వివరణ కోరగా మట్టి తరలింపు అనుమతులు ఎవరికి ఇవ్వలేదు జెసిబి యజమానులు ఒకరికొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఏమైనా అవకాశం ఉంటే చర్యలు తీసుకుంటామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇదిలా ఉంటే.. చర్లపల్లి గ్రామంలో మొరం తరలింపు మట్టి తరలింపు జరిగేది వాస్తవమే కానీ మేము అక్కడికి వచ్చేసరికి జెసిబి ట్రాక్టర్లు ఉండడం లేదు ఈసారి తప్పకుండా చర్యలు తీసుకుంటామని నడికూడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సృజన్ కుమార్ వివరణ ఇచ్చారు.
nadikuda-matti-taralimpulo-addukattuleni-adhikarulu






