అక్రిడిటేయేషన్ కార్డుల ప్రక్రియ పారదర్శకతతో పూర్తి చేయాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

by Ratna Kumari |

హన్మకొండ జిల్లాలో మీడియా అక్రిడిటేయేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

అక్రిడిటేయేషన్ కార్డుల ప్రక్రియ పారదర్శకతతో పూర్తి చేయాలి :   కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : హన్మకొండ జిల్లాలో మీడియా అక్రిడిటేయేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ, దరఖాస్తుల సంఖ్య, పరిశీలన విధానం గురించి డీపీఆర్ఓను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం.. క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన నిజమైన జర్నలిస్టులకే అక్రిడియేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. వృత్తి ప్రమాణాలు, అనుభవం, సంస్థ గుర్తింపు వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ ఆయూబ్ అలీ, డిఫూటి ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అరుణ, డీఏంఎస్సి సభ్యులు గడ్డం కేశవమూర్తి, బీఆర్ లెనిన్, వల్లాల జగన్, కంకణాల సంతోష్, నయిమ్, బుచ్చిరెడ్డి, గాడి పెళ్లి మధు, మస్కాపురి సుధాకర్, గోకారపు శ్యామ్, బొల్లా ఆమర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story