కోర్టు వాయిదాల‌కు హాజ‌రు కానీ వ్య‌క్తి అరెస్ట్

by Ratna Kumari |

కోర్టు వాయిదాల‌కు హాజ‌రు కానీ వ్య‌క్తి అరెస్ట్ అయిన ఘ‌ట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

కోర్టు వాయిదాల‌కు హాజ‌రు కానీ వ్య‌క్తి అరెస్ట్
X

దిశ‌, న‌ర్సింహుల‌పేట : కోర్టు వాయిదాల‌కు హాజ‌రు కానీ వ్య‌క్తి అరెస్ట్ అయిన ఘ‌ట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నర్సింహులపేట మండలం పెద్ద నాగారం గ్రామానికి చెందిన బొక్క జగన్ మోహన్ రెడ్డి పై 2019 లో కొట్టుకున్న కేసు నమోదు అయింది. అయితే తొర్రూర్ కోర్ట్ లో విచారణ జరుగుతున్న‌ క్రమంలో కోర్టు నిర్ణయించిన వాయిదాలకు వెళ్ళక‌పోవ‌డంతో నిందితుడిగా ఉన్న బొక్క జగన్ మోహన్ రెడ్డి కి తొర్రూర్ మెజిస్ట్రేట్ నాన్ బేలాబుల్ వారెంట్ ఉత్తర్వు ఇచ్చింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి ని అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించిన‌ట్టు ఎస్సై సురేష్ వెల్ల‌డించారు.

Next Story