భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం గద్దెల ప్రాంతం

by Malleboina Mahesh |

సమ్మక్క తల్లి గొబ్బియలో సారక్క తల్లి గొబ్బియలో అంటూ భక్తజనం ఆకాశానికి చిల్లులు పడే విధంగా నినాదాలు చేస్తూ మేడారంలోని గద్దెల ప్రాంతానికి భక్తులు చేరుకుంటున్నారు.

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం గద్దెల ప్రాంతం
X

దిశ, మేడారం: సమ్మక్క తల్లి గొబ్బియలో సారక్క తల్లి గొబ్బియలో అంటూ భక్తజనం ఆకాశానికి చిల్లులు పడే విధంగా నినాదాలు చేస్తూ మేడారంలోని గద్దెల ప్రాంతానికి భక్తులు చేరుకుంటున్నారు. బుధవారం సాయంకాలం సారాలమ్మ రానున్న దృశ్య మంగళవారం సాయంకాలం నుండి మేడారానికి నలువైపుల నుంచి భక్తులు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు, ఎడ్ల బండ్ల ద్వారా మేడారానికి చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరగా ఉదయం 9 గంటల వరకు క్యూ లైన్లు పూర్తిగా నిండిపోగా భక్తులు రోడ్డుపైనే క్యూలు కట్టారు. ఎక్కడ చూసినా ఇసుక పోతే రాలనంత భక్తి మేడారంలో తిష్ట వేసి ఉన్నారు.


కమాన్ కంట్రోల్ ద్వారా పరిస్థితులను అంచనా వేస్తున్న అధికారులు

భక్తులు తండోపతండాలుగా వస్తున్న క్రమంలో మేడారం లోని గద్దెల ప్రాంతంలో భక్తుల సందడిని జిల్లా అధికారులు కమాన్ కంట్రోల్ ద్వారా పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌లు స్క్రీన్ ల ద్వారా పరిశీలిస్తూ క్రింది సాయి సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు మేడారం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అమ్మవారు రాకను పురస్కరించుకొని జిల్లా పోలీసు యంత్రాంగం మంగళవారం రాత్రి మంగళవారం రాత్రి కవాతు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

Next Story