- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల బాధలే కాళోజీ గొడవ
తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల మధ్య విస్తరించి, రాష్ట్ర ఆవశ్యకతను చాటి చెప్పిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ధిక్కార స్వరమని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

ప్రజల బాధలే కాళోజీ గొడవ
- మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
- హనుమకొండ బీఆర్ఎప్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు
దిశ, వరంగల్ : తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల మధ్య విస్తరించి, రాష్ట్ర ఆవశ్యకతను చాటి చెప్పిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ధిక్కార స్వరమని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాళోజీ జీవిత చరిత్ర, తెలుగు భాషపై ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం తుది శ్వాస వరకు పాటుపడ్డారని, తెలంగాణ కోసం కాళోజీ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. కాళోజీ పేరుతో విశ్వవిద్యాలయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞాన కేంద్రానికి 300 గజాల స్థలం కూడా ఇవ్వలేదని, తెలంగాణ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్లు ఉడుతల సారంగపాణి, మేకల బాబురావు, తండమళ్ళ వేణు, హసన్ పార్థి మండల అధ్యక్షులు, డివిజన్ నాయకులు, విద్యార్థి నేతలు తదితరులు పాల్గొన్నారు.






