- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు.

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
దిశ, పరకాల : అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గంలోని పరకాల, పరకాల పట్టణం, ఆత్మకూరు, నడికూడ, దామెర మండలాల లబ్ధిదారులు 70 మందికి రూ.20 లక్షల 50 వేల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన ...
సద్దుల బతుకమ్మ వేడుకలను పట్టణంలోని పశువుల సంత మైదానంలో జరిగే ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని, ఎలాంటి తేడా రాకుండా బాధ్యతగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి తగు సూచన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుష్మా, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






