జేపీఎస్ ల న్యాయబద్ధమైన డిమాండ్ లను తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలి..

by Disha Web Desk 20 |
జేపీఎస్ ల న్యాయబద్ధమైన డిమాండ్ లను తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలి..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ విభాగంలోని గ్రామపంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న జేపీఎస్, ఓపీఎస్ లను తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే రెగ్యులరైజేషన్ చేస్తూ వారికి ఉద్యోగ భద్రతను కల్పించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు మంగళంపల్లి హుస్సేన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యదర్శుల దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం అర్హత పరీక్ష రాసి ఉద్యోగాలు సాధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష ధోరణి పై ఆవేదన వ్యక్తం చేశారు. 04 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ ముగిసిన జేపీఎస్, ఓపీఎస్ లను రెగ్యులరైజ్ చేయాలని వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం దీక్షలో కూర్చున్న జేపీఎస్ లకు ఓఆర్ఎస్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ స్టేట్ జాయింట్ సెక్రెటరీ అనపర్తి శ్యామ్, జిల్లా కమిటీ సభ్యులు, శ్రీకాంత్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శీలం లింగమూర్తి, కొనకటి మహేందర్ రెడ్డి, పోతుల రవి, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed