ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఆటో.. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

అక‌స్మాత్తుగా ఆగిన ట్రాక్ట‌ర్ ను దాని వెనుకాలే వ‌స్తున్న ఆటో ఢీ కొట్టిన ఘట‌న‌లో ఇద్ద‌రికీ తీవ్ర గాయాలైన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని బిలా నాయ‌క్ తండాలో చోటు చేసుకుంది.

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఆటో.. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు
X

దిశ‌, న‌ల్ల‌బెల్లి : అక‌స్మాత్తుగా ఆగిన ట్రాక్ట‌ర్ ను దాని వెనుకాలే వ‌స్తున్న ఆటో ఢీ కొట్టిన ఘట‌న‌లో ఇద్ద‌రికీ తీవ్ర గాయాలైన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని బిలా నాయ‌క్ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై గోవ‌ర్ద‌న్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మహ‌బూబాబాద్ జిల్లా గూడురు మండ‌లం మ‌ట్టేవాడ గ్రామానికి చెందిన ర‌త్న‌మాల కొడుకు క‌సునీల్తో క‌లిసి న‌ర్సంపేట నుంచి ఆటోలో మ‌ల్లంప‌ల్లికి వెళ్తుండ‌గా.. మండ‌లంలోని బిలా నాయ‌క్ తండా శివారులో నేష‌న‌ల్ హైవే 365 మీదుగా న‌ర్సంపేట నుంచి మ‌ల్లంప‌ల్లి వైపు వెళ్తున్న‌ట్రాక్ట‌ర్ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ఆగింది. దాని వెనుకే వ‌స్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లి, కొడుకు తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు 108 వాహ‌నంలో న‌ర్సంపేట ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story