తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన‌ హామీలను వెంటనే అమలు చేయాలి

by Ratna Kumari |   (  Updated:2026-05-17 12:03:11  IST  )

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మకూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ఎండి బాబుమియా అధ్యక్షతన విలేకర్ల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన‌ హామీలను వెంటనే అమలు చేయాలి
X

దిశ‌, ఆత్మ‌కూర్ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మకూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ఎండి బాబుమియా అధ్యక్షతన విలేకర్ల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కేశవరావు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో జీవో నెంబర్ 679 ప్రత్యేక కమిటీ వేయడం చాలా సంతోషం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం విధివిధానాలు తయారు చేయడం కోసం ఒక కాలపరిమితిని పెట్టాలని కోరారు. రెండున్నర సంవత్సరాల నుండి కాలయాపన చేసి ఇప్పుడు కమిటీ వేయడం సంతోషమే కానీ కాల పరిమితి లేకుండా ఉద్యమకారులను మభ్యపెట్టడాని కా అని అనుమానం వస్తుంది తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసులు లేని వారు కూడా చాలామంది ఉన్నారు వారి ఫోటోలు పత్రిక ప్రకటనల వార్తల కటింగ్ ను కూడా పరిగణలోకి అవకాశం ఇవ్వాలని అలాగే జూన్ రెండో తారీకు లోపు కాలపరిమితిని పెట్టాలని కోరుచున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి బాబుమియా(చిరు), మండల ప్రధాన కార్యదర్శి డొంక దువ్వ రాజయ్య, గ్రామ అధ్యక్షులు బలబద్ర కిషోర్, మంద రవి ,భాష బోయిన సదానందం సుధాకర్, వంగరి సమ్మయ్య టేంకురాల రామారావు, నత్తి దేవేందర్ ,పెరుమళ్ళ స్వామి, కుక్కల జంపయ్య, కరివేద సాంబ రెడ్డి ,నాగేల్లి స్వామి, పెరుమళ్ళ ఇమాన్యుల్, పెరుమాండ్ల కొర్నెల్, వడ్డేపల్లి కోటేయ్య, జాగిరపు లక్ష్మీనారాయణ, కరివేద సాంబారెడ్డి పాల్గొన్నారు.

Next Story