టీజీ ఎడ్ సెట్ 2026 నోటిఫికేష‌న్ విడుద‌ల : కేయూ వైస్ ఛాన్స్ ల‌ర్ ప్ర‌తాప్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీ ఎడ్ సెట్- 2026 నిర్వహిస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రతాపరెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో టీజీ ఎడ్ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసి తేదీలను ప్రకటించారు.

టీజీ ఎడ్ సెట్ 2026 నోటిఫికేష‌న్ విడుద‌ల : కేయూ వైస్ ఛాన్స్ ల‌ర్ ప్ర‌తాప్ రెడ్డి
X

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీ ఎడ్ సెట్- 2026 నిర్వహిస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రతాపరెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో టీజీ ఎడ్ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసి తేదీలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన విద్యార్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 23నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు దివ్యాంగుల విద్యార్థులకు ₹ 550 ఫీజు, బిసి, ఓసీలకు ₹ 750 గా ఫీజు చెల్లించాలని ఏప్రిల్ 15 చివరి తేదీగా పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నుండి అదనపు రుసుము ₹ 250, ఏప్రిల్ 27నుండి 500రూపాయల తో అదనపు రుసుము, ఏప్రిల్ 30 నుండి 1000రూపాయలు అదనపు రుసుముతో ఫీజు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ నమోదులో తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి అవకాశం మే 2 తేదీ గా అవకాశం ఇస్తున్నట్లు, చివరి నిమిషంలో విద్యార్థులు ఆన్ లైన్ లో నమోదు చేయాలనుకునే విద్యార్థులకు మే 8 తేదీ నుంచి 9వ తేదీ లోపు 5000 రూపాయల అపరాధ రుసుముతో అప్లయ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం మే 4తేదీ న పరీక్ష కేంద్రాల నిర్దారణ విడుదల చేయనున్నట్లు మే 9వ తేదీన హల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16సెంటర్లలో పరీక్ష కేంద్రాలు పరీక్ష నిర్వహణ నిర్వహించనున్నట్లు, మే 12వ తేదీన ఉదయం 10 గంట‌ల నుంచి 12గంటల వరకు, రెండోవ సెక్షన్ లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు , పరీక్ష పరీక్షలు నిర్వహించబడతాయని వీటికి సంబంధించిన పరీక్ష కీ మే 15వ తేదీన విడుదల చేయనున్న‌ట్టు తెలిపారు.

Next Story